ఆరోగ్యమే మహా భాగ్యం - Health Tips
- malyabangalore
- Feb 28, 2018
- 2 min read

బరువు తగ్గడానికి ఉదయాన్నే చేయగల నాలుగు అలవాట్లు
ఉదయం ఏదైనా చేయడానికి సరైన సమయం. ప్రత్యేకించి, హెల్త్ గురుంచి అలోచించడానికి, అందుకై ఏదైనా చేయడానికి కూడా. హెల్త్ గోల్స్ గుర్తు చేసుకొని ఉత్తేజితమై, ప్రేరణ పొందనికి కూడా అనువైన సమయం. ప్రత్యేకించి, బరువు తగ్గడానికి ఈ సమయం లో చేసే కొన్ని పనుల వలన చాల ప్రభావితం కూడా చేస్తాయి.
1
ఉదయపు సూర్య కిరణాలనుఆస్వాదించడం
ఉదయపు సూర్యుడి కిరణాలకు ఆరోగ్యపరమైన ప్రయోజానాలున్నాయని మనందరికీ తెలిసిందే. ఈ మధ్య లో జరిపిన ఓ సర్వే ప్రకారం, ఉదయన్నే సూర్య కిరణాలను అనుభవించడం ద్వార కూడా బరువు తగ్గోచ్చని నిరూపించడం జరిగింది. దాంట్లో ఉన్న సైంటిఫిక్ నిజాలను పక్కన పడితే, ఉదయన్నే బయటకేల్లడం తో తనువూ, మనసు ఉత్తేజ పడుతాయి. ఇది రోజంత ఆక్టివ్ గ ఉండడానికి దోహపడుతుంది. ఇంకో మాటలో ఎక్కువ కాలోరీస్ ఖర్చు చేయడం అన్నమాట, అంటే సన్నగా అవ్వడమే.
2
ఎక్సర్సైజ్లు చేయడం
వ్యాయామాలు ఎప్పుడు చేసిన ఆరోగ్యానికి మంచిదే, కాని ఉదయన్నే చేయడం వలన పలితాలు మెరుగ్గా ఉంటాయి. రోజులో మీగత సమయాల్లో వ్యాయామాలు చేయడానికి చాల విషయలు పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా, సాయంత్రం సమయాల్లో చేస్తే అలసట, సరైన మోటివేషన్ లేక క్రమం=నగ చేయకపోవచ్చు, కాని ఉదయన్నే క్రమ పద్దతిలో, క్రమం తప్పకుండ చేయవచ్చు. దీనితో పలితాలు మెరుగుగ్గా ఉంటాయి.
3
ప్రోటీన్ రిచ్ అల్పాహారం తీసుకోవడం
బ్రేక్ఫాస్ట్ కి సరైన ఆహారం ఏంటి అనే దానిపై రీసెర్చ్ జరుగుతూనే ఉంది. ఇప్పటివరకి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ప్రోటీన్ లు పుష్కలంగా ఉన్న అల్పాహారాలు బరువు నియంత్రించడంలో సహకరిస్తాయని నిర్దారించడం జరిగింది. ముఖ్యంగా, ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉన్న పదార్థాలు క్రావింగ్స్ ను నియంత్రించి, ఫుల్ గ ఉన్న భావనను కలిగిస్తాయి. దీనితో జంక్ పదార్థాలను చూసినప్పుడు మనల్ని మనం నియంత్రించుకోవడం సులువు అవుతుంది. ఇలగా బరువును అదుపులో పెంచుకోవచ్చు.
4
మార్నింగ్ రొటీన్ ఆక్టివ్ గ ఉండేలా చూసుకోవడం
వీలైనంత వరకు ఉదయపు రొటీన్ ఆక్టివ్ గ ఉండేలా చూడండి. లిఫ్ట్ లు వాడడానికి బదులు మెట్లు ఎక్కండి. ఒకవేళ డ్రైవింగ్ చేస్తూ ఆఫీస్ కి వెళ్తే, కొంచం దూరంలోనే వెహికల్ ను ఆపి నడవాడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీరు పనిచేసే ప్రదేశం దగ్గరలో ఉంటె వెహికల్ లో కాకుండా, మ్యానువల్ గ వాడే సైకిల్ లాంటి వాటిలో ప్రయత్నించండి. ముఖ్యంగా, ఉదయాన్నే ఇలా ఆక్టివ్ గ ఉండే పనులు చేయడం ద్వార రోజంతా ఆక్టివేట్ గ ఉండడమే కాకుండా, ఎక్కువ కాలోరీస్ ఖర్చు చేయడం తో పాటు గ మెటబాలిజం కూడా మెరుగు పడుతుంది.
Comments